: నేడు చెన్నై రానున్న రక్షణ మంత్రి.. గల్లంతైన విమానం గాలింపు చర్యలను పర్యవేక్షించనున్న పారికర్
గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం 'ఏఎన్-32' గాలింపు చర్యలను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేడు చెన్నై రానున్నారు. తాంబరం ఎయిర్ బేస్‌ను చేరుకుని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ అరూప్ రాహాను అడిగి వివరాలు తెలుసుకుంటారు. విమానం ఆచూకీని తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీయనున్నారు. రష్యా తయారీ విమానం ఆంటనోవ్-32 నిన్న 29 మంది సిబ్బందితో పోర్ట్‌బ్లెయిర్ వెళ్తూ చెన్నైకి 280 కిలోమీటర్ల దూరంలో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విమానంలో ఆరుగురు విమాన సిబ్బంది, ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, కోస్ట్‌గార్డుకు చెందిన 15 మంది, 8 మంది పౌరులు ఉన్నారు.