: మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నేత జీవీ శేషు ఇక లేరు!
ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి జీవీ శేషు (71) నిన్న రాత్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన జీవీ శేషు... ప్రకాశం జిల్లా డీసీసీ చీఫ్ గా పనిచేయడంతో పాటు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ దఫా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగానూ ఆయన పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.