: ఏపీలో టీడీపీదే భవిష్యత్తు!... వేరే పార్టీలకు డిపాజిట్లూ దక్కవన్న చంద్రబాబు!


నవ్యాంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల భవితవ్యంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలో చేరిక సందర్భంగా నిన్న విజయవాడలో ఏర్పాటు చేసిన వేదికపై సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘భవిష్యత్తులో టీడీపీ తప్ప వేరే పార్టీ రాష్ట్రంలో మనుగడ సాగించలేదు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా మరే పార్టీ నిలబడలేదు. వేరే పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. ఈ విషయం అప్పారావు సహా అందరికీ అర్థమైంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News