: మ్యూనిక్‌లో భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరిక.. హెల్ప్‌లైన్ ఏర్పాటు
జర్మనీలోని మ్యూనిక్‌లో గతరాత్రి జరిగిన ఉగ్రఘటన నేపథ్యంలో అక్కడి భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. పోలీసుల సూచనలు పాటించాలని పేర్కొంది. భారతీయుల క్షేమసమాచారాలు అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 0171 2885973, 01512 3595006, 0175 4000667 నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. మ్యూనిక్ వచ్చిన భారత పర్యాటకులు తమ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని సూచించింది. పోలీసుల సూచనలు పాటించాలని జర్మనీలో భారత రాయబారి గుర్జిత్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత రాత్రి మ్యూనిక్‌లోని ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అతడి కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఉగ్రవాది కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.