: గుంటూరు మిర్చియార్డులో సీబీఐ అధికారులు!... పత్తి కొనుగోలు కుంభకోణాలపై దర్యాప్తు!


గుంటూరులో నిన్న మధ్యాహ్నం పెను కలకలమే రేగింది. నగరంలో పత్తి, మిర్చి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యాపారులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఎందుకంటే... గుంటూరులో గతంలో వెలుగుచూసిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన కుంభకోణాలపై దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు నగరంలోకి ప్రవేశించారు. విశాఖ నుంచి నిన్న మధ్యాహ్నానికి గుంటూరు చేరుకున్న సీబీఐ అధికారులు నేరుగా మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కార్యాలయంలో పలు ఫైళ్లను పరిశీలించారు. ఈ కుంభకోణాల్లో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఎక్కడికి బదిలీ అయ్యారన్న వివరాలను కూడా సేకరించారు. అంతేకాకుండా మోసం జరిగిన తీరుపై అక్కడ పనిచేస్తున్న కార్మికులతో సుదీర్ఘ విచారణ చేపట్టారు. పత్తి కొనుగోళ్ల కుంభకోణంపై దర్యాప్తునకు సీబీఐ అధికారులు వచ్చారన్న విషయం వ్యాపార వర్గాలకు క్షణాల్లో చేరిపోయింది. దీంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెళ్లే దాకా ఏమేం జరిగిందన్న విషయాలపై వ్యాపారులు ఆరా తీశారు.

  • Loading...

More Telugu News