: ఆ ఉగ్రవాది జర్మన్-ఇరానియన్ యువకుడు: వెల్లడించిన మ్యూనిక్ పోలీసులు


జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఓ షాపింగ్ మాల్‌పై విరుచుకుపడిన ఉగ్రవాది 18 ఏళ్ల యువకుడని మ్యూనిక్ పోలీసులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నగరానికి చెందిన జెర్మన్-ఇరానియన్ అని పోలీస్ చీఫ్ హబెర్టస్ ఆండ్రీ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి షాపింగ్ మాల్‌లో జరిగిన దాడిలో ఉగ్రవాది సహా పదిమంది మృతి చెందారు. నగరంలోని ఒలింపిక్ స్టేడియం సమీపంలో కాల్పులకు పాల్పడిన ఉగ్రవాది అనంతరం తనను తాను కాల్చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని మాల్‌కు కిలోమీటరు దూరంలో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు దేశాల పౌరసత్వం ఉన్న ఉగ్రవాదికి గతంలో ఎటువంటి నేరచరిత్ర లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News