: తెలుగు రాష్ట్రాల మధ్య పోలీసుల విభజన పూర్తి!... స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కేంద్రం!


రాష్ట్ర విభజన జరిగినా... పోలీసు శాఖలో ఇంకా విభజనే జరగలేదంటూ ఏపీ మాజీ డీజీపీ జేవీ రాముడు చివరి దాకా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే జేవీ రాముడు పదవీ విరమణ చేసిన నాడే (నిన్న) రెండు రాష్ట్రాల మధ్య పోలీసు శాఖను పూర్తిగా విభజన చేస్తూ కేంద్రం స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి మధ్య ఉన్న మొత్తం 42 కేడర్ పోస్టులన్నిటినీ రెండు రాష్ట్రాలకు విభజించామని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల విభజన పూర్తి కాగా, తాజాగా సిబ్బందిని కూడా ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేశామని... వెరసి తెలుగు రాష్ట్రాల మధ్య పోలీసు శాఖ విభజన పూర్తైపోయిందని డీఓపీటీ తెలిపింది.

  • Loading...

More Telugu News