: అత్యాచారాలు కొత్తకాదు.. భూమి పుట్టినప్పటి నుంచీ జరుగుతూనే ఉన్నాయి: బీజేపీ మహిళా సెల్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు


హర్యాణా బీజేపీ మహిళా సెల్ చీఫ్ నిర్మల్ బైరాగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు ఏమీ కొత్తకాదని, భూమి పుట్టినప్పటి నుంచీ అవి జరుగుతూనే ఉన్నాయని అన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రోహ్‌తక్ ఘటనపై జరుగుతున్న పోలీసు దర్యాప్తు పురోగతి గురించి విలేకరులు ఆమెను ప్రశ్నించారు. దీనికి స్పందించిన నిర్మల్ ‘‘భూమి పుట్టినప్పటి నుంచే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి’’ అని బదులిచ్చారు. రోహ్‌తక్‌లో దళిత మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అత్యాచారం లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News