: బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ మళ్లీ మాయచేశాడు
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. భారత్- బంగ్లా పర్యటనతో వెలుగులోకి వచ్చిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆ సిరీస్ లో టీమిండియాను ముప్పతిప్పలు పెట్టాడు. అనంతరం జరిగిన ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్ టైటిల్ ఫ్రాంచైజీకి దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడుతున్న... ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఇంగ్లాండ్ లో జరుగుతున్న నాట్ వెస్ట్ టీ20 బ్లాస్ట్ లో ససెక్స్ షార్క్స్ తరఫున అరంగేట్రం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 200/6 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఎసెక్స్ ఈగిల్స్ జట్టు ముస్తాఫిజుర్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 176/8 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ముస్తాఫిజుర్ 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ఆ జట్టు ప్రత్యర్థిపై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.