: ప్రధాని మోదీపై కేసు నమోదు చేయాలంటూ ‘పాక్’ కోర్టులో పిటిషన్


ప్రధాని నరేంద్ర మోదీపై కేసు నమోదు చేయాలంటూ పాకిస్థాన్ లోని లాహోర్ హైకోర్టులో ఒక న్యాయవాది పిటిషన్ వేశారు. మోదీ ఆదేశాల కారణంగా జమ్మూకాశ్మీర్ లో అమాయకులను చంపుతున్నారని ఆరోపిస్తూ అబ్దుల్ హమీద్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. మోదీపై హత్య, ఉగ్రవాదం నేరాలకు సంబంధించి పాక్ పీనల్ కోడ్, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆ న్యాయవాది కోరారు. కాగా, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జమ్మూకాశ్మీర్ లో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ భారత్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ అధ్యక్షుడు విరేష్ శాండిల్యా ఆరోపిస్తూ, ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఇటీవల అంబాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీపై ఈ ఆరోపణలు చేస్తూ పాకిస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News