: పద్మజ ఆరోపణలు అవాస్తవం... నేను ఎలాంటి కబ్జాకు, మోసానికి పాల్పడలేదు: ఎంపీ గల్లా జయదేవ్
గుంటూరులోని తన భవనాన్ని తక్కువ ధరకు కాజేసేందుకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ యత్నిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని, తాను ఎలాంటి కబ్జాకు, మోసానికి పాల్పడలేదని చెప్పారు. ఆంధ్రా బ్యాంకుకి రూ.2.8 కోట్లు పద్మజ బకాయి పడ్డారని, బ్యాంక్ వేలంలో రూ.3.09 కోట్లు చెల్లించి ఆ భవనాన్ని తాము కొనుగోలు చేశామని అన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత పద్మజ ఆ భవనం నుంచి ఖాళీ చేసిందని, ఆ భవనం వేలం పాట నిర్వహించిన రోజే 25 శాతం డబ్బు తాము చెల్లించామని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.