: టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు, భారీ అనుచరగణంతో ఆదిరెడ్డి విజయవాడ చేరుకున్నారు. కాగా, ఆదిరెడ్డి రాజకీయ జీవితం టీడీపీలోనే ప్రారంభమైంది. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీలోకి వెళ్లారు. మళ్లీ తిరిగి సొంత గూటికే ఆయన చేరుకున్నారు.