: వ్యాపారి దంపతులు, సహాయకుడు దారుణ హత్య


ఒక వ్యాపారవేత్తను, అతని భార్య సహా వారి సహాయకుడిని దారుణంగా హత్య చేసిన విషాద సంఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. మాల్దాలోని ఇంగ్లీషు బజార్ ప్రాంతంలోని వారి నివాసంలోనే ఈ హత్యలు జరిగాయి. వ్యాపారవేత్త రామ్ రతన్ అగర్వాల్, అతని భార్య, వారి సహాయకుడు గణేశ్ రామ్ లను కొందరు దుండగులు హత్య చేశారు. రామ్ రతన్ ఇంట్లో పనిచేసే పనిమనిషి ఈరోజు ఉదయం వారి ఇంటికి వెళ్లడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురిని హతమార్చిన దుండగులు, ఇంట్లో ఉన్నవన్నీ దోచుకుపోయారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో వ్యాపారి పిల్లలు ఇంట్లో లేరని, చదువు నిమిత్తం మాల్దా వెళ్లారని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News