: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్తత.. భద్రతా బలగాల కాల్పుల్లో యువకుడి మృతి
హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన కీలక ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఆ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా అవంతిపొరా ప్రాంతంలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. భద్రతా బలగాలపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. దీంతో ఆందోళనకారులు, భద్రతాబలగాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందాడు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో అక్కడ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరింది.