: పార్లమెంటుకు క్షమాపణలు చెప్పిన 'ఆప్' ఎంపీ భగవంత్ మాన్


పార్లమెంట్‌ దగ్గర హై సెక్యూరిటీ పాయింట్లు, దారులను తన సెల్‌ ఫోన్ తో వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్ క్షమాపణలు చెప్పారు. ఈ రోజు పార్లమెంటులో ఆయన తీరుపై వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతను తాకట్టుపెట్టారంటూ మండిపడ్డారు. దీంతో ఆయన వ్యవహారశైలిపై లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా తనను కలవాలని ఆమె ఆదేశించారు. దీంతో ఆమెను కలిసిన భగవంత్ మాన్ జరిగిన పరిణామాలపై లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. ఇంకోసారి ఇది రిపీట్ కాదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News