: రెండు విమానాలు, నాలుగు యుద్ధ నౌకలతో ఏఎన్-32 విమానం కోసం విస్తృత గాలింపు
ఈరోజు ఉదయం చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఏఎన్-32 విమానం కనిపించకుండా పోయిన సంగతి విదితమే. దీనికోసం చెన్నైకు తూర్పుదిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండు విమానాల ద్వారా నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. మరోవైపు నాలుగు యుద్ధ నౌకలతోనూ అధికారులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. విమానానికి చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోవడంతో దాని ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాల్సి వస్తోంది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఆ విమానం పోర్టుబ్లెయిర్ చేరాల్సి ఉంది. విమానానికి, ఏటీసీకి మధ్య సంబంధాలు తెగిపోయిన సమయంలో 23వేల అడుగుల ఎత్తులో విమానం ఉంది.