: మరో అమ్మాయితో కలసి భర్త షికార్లు ... ఆ ప్రియురాలిని కుమ్మేసిన భార్య!


చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ లోని వెంఝౌ లాంగ్ వాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. భర్త తనను మోసం చేస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో ఓ మహిళ వెంఝౌ లాంగ్ వాంగ్ విమానాశ్రయంలో భర్తపై నిఘా వేసింది. ఆమె ఊహించినట్టే భర్త తన ప్రియురాలితో కలిసి విమానాశ్రయంలో దిగాడు. ఇద్దరూ కలిసి సరదాగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా వారిద్దరి మధ్య అతని భార్య ప్రత్యక్షమైంది. ఊహించని ఆ పరిణామానికి షాక్ తిన్న వారిద్దరూ తేరుకోకముందే, అతని ప్రియురాలిపై భార్య దాడికి దిగింది. నన్ను మోసం చేస్తావా? అంటూ ఆమెపై విరుచుకుపడింది. భర్త ఎంత అడ్డుకున్నా ఆమె ఆగలేదు, ఆమె బట్టలు చించిమరీ అవమానపరిచేందుకు పెనుగులాడింది. ఆమె ప్రయత్నాల్ని అడ్డుకునే క్రమంలో అతను, అతని ప్రియురాలు ఎంత పెనుగులాడినా పలితం లేకపోయింది. దీంతో చుట్టూ ఉన్న ప్రయాణికులు కల్పించుకుని వారిని విడదీశారు. ఈ తతంగం అంతా ఆ విమానాశ్రయంలోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News