: ఆ ప్రాజెక్టులను టీఆర్ఎస్ మళ్లీ ప్రారంభించడం నవ్వులాటగా ఉంది: మల్లు భట్టీవిక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోన్న ప్రాజెక్టులపై టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లు భట్టీవిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ మళ్లీ ప్రారంభించడం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు ప్రారంభించిన ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాలు విసిరారు. ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టుల అంచనాలు పెంచుతున్నారని ఆయన ఆరోపించారు.