: ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ లకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ముత్యాలరాజు, విశాఖ మున్సిపల్ కమిషనర్ గా హరినారాయణ, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా గిరీశ్ షా, పాడేరు ఐటీడీఏ ఇన్ ఛార్జి పీడీగా శివశంకర్ కు అదనపు బాధ్యతలప్పగించారు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని విశాఖ కలెక్టర్ యువరాజు, నెల్లూరు కలెక్టర్ జానకి కి ఆదేశాలందాయి.