: ఇకపై ఒకే ఒక్కరోజులో పాన్, టాన్ కార్డులు మంజూరు


ఇకపై కంపెనీలకు ఒకే ఒక్కరోజులో పాన్, టాన్ రిజిస్ట్రేషన్లు పొందే అవకాశం లభించనుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం చర్యలు ప్రారంభించింది. కంపెనీలతో పాటు సాధారణ వ్యక్తులు కూడా పాన్ కార్డును మరింత సులువుగా, తక్కువ సమయంలో పొందేందుకుగాను ఆధార్ కార్డు ఆధారిత ఈ-సిగ్నేచర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డును, ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్ (టాన్) కార్డును కంపెనీలకు త్వరగా అందించేందుకుగాను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ( ఎన్ఎస్ డీఎల్) ఈ గవర్నమెంట్, యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (యూటీఐఐటీఎస్ఎల్) లాంటి పాన్ సర్వీస్ ప్రొవైడర్స్ కు డిజిటల్ సంతక ఆధారిత దరఖాస్తును ప్రవేశపెట్టినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ నూతన ప్రక్రియతో ఆన్ లైన్ అప్లికేషన్ ను నమోదు చేసిన ఒక్కరోజులోనే పాన్, టాన్ కార్డులను ఆయా కంపెనీలకు అందిస్తామని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. కాగా, సాధారణ దరఖాస్తుదారులకు కూడా ఆధార్ ఆధారిత అప్లికేషన్ ప్రక్రియను పాన్ సర్వీసు ప్రొవైడర్లు ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News