: రేపు ‘కల్లోల కశ్మీర్’లో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన కీలక ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌లో హతమైన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఇటీవల పెద్దఎత్తున చెలరేగిన అల్లర్లు ఇంకా తగ్గలేదు. కశ్మీర్ కల్లోలంగా మారడంతో అక్కడ భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రేపు జమ్మూకశ్మీర్‌లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాజ్‌నాథ్ సింగ్ ఆ రాష్ట్రంలో తిరిగి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడానికి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.