: నా కొడుకును కాల్చి పారేయండి: పాక్ మోడల్ కందీల్ బలోచ్ తండ్రి


పాకిస్థాన్ మోడల్ కందీల్ బలోచ్ ఇటీవల తన అన్న చేతిలో పరువు హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి అన్వర్ అజీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు పేరుతో తన కూతురుని హతమార్చిన తన కుమారుడు కనిసిస్తే కాల్చి చంపేయండంటూ వ్యాఖ్యలు చేశారు. తన కూతురిని గొంతు నులిమి చంపేశాడని, అతడు కనిపిస్తే కాల్చి చంపేయాలని ఆయన అన్నారు. ఈ సంఘటన జరిగిన రోజున తాము ఇంట్లో పై అంతస్తులో ఉన్నామని, ఈ సంఘటన జరిగిన రోజున పాలు తాగామని, అందులో తమ కొడుకు మత్తు మందు కలపడం వల్ల అందరం స్పృహ తప్పి పడున్నామన్నారు. కందీల్ బలోచ్ కూడా స్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెను ఊపిరాడకుండా చేసి ఉంటాడని బలోచ్ తల్లిదండ్రులు వాపోయారు. మర్నాడు ఉదయం కందీల్ ను నిద్ర లేపేందుకు వెళితే ఆమె నిద్ర లేవలేదని, ముఖమంతా కమిలిపోయి, నాలుక, పెదవులు నల్లగా అయిపోయి ఉన్నాయని బలోచ్ తల్లిదండ్రులు చెప్పారు.

  • Loading...

More Telugu News