: ఇతర బిల్లులు వద్దు...ఏపీ ప్రత్యేకహోదా బిల్లుపైనే చర్చించండి: సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేకహోదా బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని టీడీపీ నేత సీఎం రమేష్ డిమాండ్ చేశారు. రాజ్యసభ మధ్యాహ్న భోజన సమయం తరువాత ప్రారంభమైన సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్యలాంటిదని, ఐదు కోట్ల మంది ప్రజలు దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, అంత కీలకమైన బిల్లుపై ఓటింగ్ జరిగిన తరువాతే ఇతర బిల్లులపై ఓటింగ్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నినాదాలు మిన్నంటడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే బిల్లులపై ముందుగా ఓటింగ్ జరగాలని ఆయన గట్టిగా ఆడిగారు. ఇలాంటి కీలకమైన బిల్లు సమయంలో అందరూ సహకరించాలని ఆయన సూచించారు. గందరగోళం హోరులో సభను డిప్యూటీ ఛైర్మన్ వాయిదా వేశారు.