: మీ మాట వింటాను... ముందు నా మాట వినండయ్యా!: సభ్యులకు కురియన్ విజ్ఞప్తి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై తొలుత ఓటింగ్ జరగాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన వేళ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై ముందుగా చర్చ జరగాలంటూ కాంగ్రెస్ నేతలు పొడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తున్న వేళ...కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎందుకిలా చేస్తున్నారు? సభకు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది' అని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా ఆందోళనలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. 'ముందు తన మాట వింటే...తరువాత అందరి మాట వింటా'నని ఆయన పలు మార్లు హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు ఆందోళన చేయడంతో...తనకేమీ వినపడడం లేదని...ముందు తన మాట వింటే తరువాత అందరిమాట వింటానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News