: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా బిల్లుపై ముందు ఓటింగ్ జరగాల్సిందే!: పట్టుబట్టిన కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై తొలుత ఓటింగ్ జరగాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కావాలని ముందుగా 13 బిల్లులపై చర్చ జరగాలని చెబుతోందని, చివర్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లు ప్రవేశపెడతామంటున్నారని... చివర్లో సభను వాయిదా వేయించే కుతంత్రానికి తెరలేపిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముందుగా ఏపీ స్పెషల్ స్టేటస్ బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందేనని, మొదట దానిని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయగా, ప్రొసీజర్ ప్రకారం సభ నడవాల్సిందేనని, ఆ తరువాత బిల్లులు ప్రవేశపెడతామని, అందులో ఏపీ స్పెషల్ స్టేటస్ బిల్లు కూడా ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఇతర పక్షాల నేతలు నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది.