: ఓటుకు నోటు కేసులో కీలక మలుపు!... మత్తయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు!


తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఓటుకు నోటు కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జురూసలెం మత్తయ్య అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏపీలోని విజయవాడలో తలదాచుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి అభయం తీసుకున్న తర్వాతే హైదరాబాదులో అడుగుపెట్టిన వైనం నాడు కలకలమే రేపింది. మత్తయ్యను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మత్తయ్యతో పాటు కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ఏసీబీకీ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని సదరు నోటీసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News