: తూర్పు తీరంలో కలకలం!... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం!
తూర్పు తీరంలో నేటి ఉదయం కలకలం రేగింది. 29 మంది భారత వైమానిక దళ అధికారులతో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ విమానం (ఏఎన్-32) కనిపించకుండా పోయింది. చెన్నై నుంచి నేటి ఉదయం 8 గంటలకే బయలుదేరిన ఈ విమానం ఎంతసేపటికీ పోర్ట్ బ్లెయిర్ చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా విమానం అదృశ్యమైన విషయం వెలుగు చూసింది. చెన్నైలో బయలుదేరిన సదరు విమానానికి 8.12 గంటలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో సదరు విమానం ప్రమాదానికి గురైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.