: హరియాణా మాజీ ముఖ్యమంత్రిపై మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు


అక్రమ భూకేటాయింపుల కేసులో మనీలాండరింగ్‌ చట్టం కింద హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడాపై కేసు నమోదయింది. భూపిందర్ సింగ్‌తో పాటు నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అసోసియేట్‌ జర్నల్స్‌ లిమిటెడ్ అధికారుల‌పై కూడా ఈడీ కేసు కేసు న‌మోదు చేసింది. హ‌రియాణా ముఖ్య‌మంత్రిగా భూపిందర్‌ సింగ్ ఉన్నప్పుడు నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా అసోసియేట్‌ జర్నల్‌ లిమిటెడ్‌కు 14 ప్లాట్లను త‌క్కువ రేటుకే అప్ప‌జెప్పిన‌ట్లు ఆయ‌నపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో స‌ర్కారుకి కోట్లాది రూపాయ‌లు నష్టం వాటిల్లింది. భూపిందర్‌ సింగ్‌ హుడా అంత‌కు ముందు హరియాణా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కూడా ప‌నిచేశారు. అప్పుడు కూడా భూముల కేటాయింపు అంశంపై అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌డంతో సీబీఐనుంచి కేసులు ఎదుర్కున్నారు.

  • Loading...

More Telugu News