: కేవీపీ బిల్లు ఓటింగ్ సమయంలో సభ్యులంతా సభలోనే ఉండాలి!: ఆజాద్ కు రాహుల్ గాంధీ ఆదేశం


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ కు అన్ని పార్టీలు తమవైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. తాము ప్రతిపాదించిన ఈ బిల్లును నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పక్కా వ్యూహాలు రచించింది. ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న పలు పార్టీల నేతలతో నేరుగా భేటీలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయా పార్టీల మద్దతు కూడగట్టారు. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... రాజ్యసభలో పార్టీ నేత గులాం నబీ ఆజాద్ కు ఓ కీలక సందేశం పంపారు. కేవీపీ బిల్లుపై ఓటింగ్ సమయంలో సభ్యులంతా సభలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News