: ట్విట్టర్ లో ‘కబాలి’ హోరు!... వినూత్న కామెంట్లతో మోత మోగిస్తున్న ఫ్యాన్స్!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అమెరికాలో ఓ రోజు ముందుగానే విడుదలైన ఈ చిత్రంపై హిట్ టాక్ వినపడటంతో ఒక్క తమిళనాడే కాకుండా దేశవ్యాప్తంగా ‘కబాలి’ థియేటర్లకు జనం పోటెత్తారు. ఎక్కడికెళ్లినా ‘హౌస్ ఫుల్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఓ వైపు రజనీకాంత్ పదునైన డైలాగులతో సినిమా థియేటర్లు హోరెత్తుతుంటే... ఆ చిత్రంపై వినూత్న కామెంట్లతో ట్విట్టర్ మోత మోగుతోంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు తమదైన రీతిలో వినూత్న ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. చిత్రంలోని ప్రతి సీన్ పైనా అభిమానులు వినూత్న కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ల సంఖ్య నిమిష నిమిషానికి పెరుగుతోంది.