: ప్రైవేట్ బిల్లులపై చర్చకు రెడీ!... రాజ్యసభను 2.30 గంటలకు వాయిదా వేసిన కురియన్!


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ కు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఆప్ ఎంపీ దుస్సాహసంపై రగడ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడగా, ఇదే అంశంపై రచ్చ నేపథ్యంలో రాజ్యసభ మాత్రం నేటి మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే వాయిదా పడింది. ప్రైవేటు బిల్లులపై చర్చకు సిద్ధమన్న రీతిలోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ప్రారంభం కాగానే నేరుగా ప్రైవేటు బిల్లులపై చర్చ మొదలవుతుంది. తొలుత 13 బిల్లులపై చర్చ ముగిసిన తర్వాతే కేవీపీ బిల్లుపై ఓటింగ్ జరగనుంది.

  • Loading...

More Telugu News