: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన తెలంగాణ న్యాయ విద్యార్థులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ న్యాయ విద్యార్థులు ఈరోజు ధర్నాకు దిగారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయినా హైకోర్టు విభజన జరగకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన వెంటనే చేయాలని నినాదాలు చేశారు. న్యాయ విద్యార్థుల ధర్నాకు తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాం నాయక్ మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు అన్నారు.