: హోదా ఇస్తే జీఎస్టీ బిల్లుకి మద్దతు తెలుపుతామని ప్రకటించండి: టీజీ వెంకటేశ్ సూచన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రైవేటు బిల్లుని సాధించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అవసరమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. కేవీపీ బిల్లు ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీజీ వెంకటేశ్ ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి హోదా ఇస్తే జీఎస్టీ బిల్లుకి మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ ప్రకటించాలని అన్నారు. తాము ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో వెనకడుగు వేయబోమని ఆయన తెలిపారు. కేవీపీ బిల్లుకి మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.