: షూటింగ్ కు స్వల్ప విరామమిచ్చిన చిరంజీవి!... భుజానికి బ్యాగుతో పార్లమెంటులో ప్రత్యక్షం!
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై నేడు ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేటి పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాల్లోకి కేవీపీ బిల్లే హాట్ టాపిక్ గా మారింది. బిల్లును ఎలాగైనా ఆమోదం సాధించాలన్న లక్ష్యంగా మంత్రాంగం నెరపుతున్న కాంగ్రెస్ పార్టీ... నేటి సమావేశాలకు తన సభ్యులంతా హాజరు కావాలని విప్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో తన 150 చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో ప్రత్యక్షం కాక తప్పలేదు. కేవీపీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు తన సినిమా షూటింగ్ కు స్వల్ప విరామమచ్చిన చిరంజీవి కొద్దిసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కారు దిగిన ఆయన భుజానికి ఓ బ్యాగేసుకుని పార్లమెంటు లోపలికి వెళుతున్న దృశ్యం ఆకట్టుకుంది.