: ఇక వైసీపీ వంతు!... ఏపీకి ‘హోదా’ కోసం లోక్ సభలో వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు బిల్లు!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో మరింత గట్టి వాదన వినిపించనుంది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై గత సమావేశాల్లోనే చర్చ ముగియగా, నేడు రాజ్యసభలో జరగనున్న ఓటింగ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరు సాగిస్తున్నామని చెప్పుకుంటున్న ఏపీలోని విపక్షం వైసీపీ లోక్ సభలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించేందుకు సిద్ధపడింది. ఈ మేరకు ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, ఒంగోలు లోక్ సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు బిల్లును ప్రతిపాదించనున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News