: ‘కబాలి’కి ‘శివాజీ’ స్టెప్పులతో స్వాగతం చెప్పిన అమెరికాలోని ఎన్నారై యువతులు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’కి విశ్వవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కబాలి’ని చూసేందుకు భాషలకతీతంగా భారతీయులు థియేటర్ల ముందు బారులు తీరారు. ఒక రోజు ముందుగానే అమెరికాలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడి ఎన్నారైలు బ్రహ్మరథం పట్టారు. అమెరికాలోని ఓ నగరంలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ ముందు టీషర్ట్ లు, జీన్స్ ప్యాంట్లలో ప్రత్యక్షమైన ఎన్నారై యువతులు వరుసగా నిలబడి రజనీ హిట్ చిత్రం ‘శివాజీ’లోని పాటలకు తమదైన రీతిలో స్టెప్పులేస్తూ ‘కబాలి’కి స్వాగతం పలికారు. ఈ దృశ్యాలు పలు ప్రాంతీయ, నేషనల్ న్యూస్ ఛానెళ్లలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి.