: తమిళ నటుడు శింబు ఏకంగా 250 టికెట్స్ కొనుగోలు చేశాడట!


స్టైలుకే స్టైలు నేర్పే సూప‌ర్‌స్టార్ ర‌జనీ కాంత్ మూవీ 'క‌బాలి'ని మొద‌టి రోజే చూడాలని అభిమానులు ఎంత‌గా ఆరాట‌ప‌డుతున్నారో తెలిసిందే. సామాన్యుడి నుంచి రాజ‌కీయ‌ నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ క‌బాలి కోస‌మే థియేట‌ర్ల బాట‌ప‌డుతున్నారు. క‌బాలి టికెట్‌ల కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 5000 థియేటర్లలో ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. ఒక్క చెన్నై న‌గ‌రంలోనే 650 థియేటర్లలో ఈ చిత్రం ప్ర‌ద‌ర్శిత‌మవుతోంది. ప‌లు థియేటర్లలో కబాలి చిత్రాన్ని 24 గంటలు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ర‌జ‌నీకి అభిమాని అయిన ప్ర‌ముఖ న‌టుడు శింబు ఈ సినిమా టికెట్లు ఏకంగా 250 తీసుకున్నాడ‌ట‌. మధురైలోని ఓ థియేటర్‌లో త‌న టీంతో ర‌జ‌నీ మూవీని చూసేందుకు శింబు ఈ టికెట్లు తీసుకున్న‌ట్లు టాక్. ప్రస్తుతం శింబు 'అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని మధురైలో చేస్తున్నారు.

  • Loading...

More Telugu News