: వర్షంతో ట్రాఫిక్ జామైతే... ఆ జంట నడిరోడ్డుపై సరసాలు మొదలెట్టింది!: వైరల్ గా మారిన వీడియో


దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురిస్తే... రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. చాంతాడంత ట్రాఫిక్ జామ్ లను క్లియర్ చేయడానికి పోలీసులు ముప్పు తిప్పలు పడాల్సిందే. ఇక వాహనాల్లో నడిరోడ్డుపై చిక్కుకున్న జనం ఇళ్లకు ఎప్పుడు చేరుకుంటారో కూడా తెలియని దుస్థితి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఓ జంట చేసిన ఘనకార్యానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల భారీ వర్షంతో రోడ్లపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా... ఓ బైకుపై వెళుతున్న జంట కూడా ఆ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. ఎప్పుడెప్పుడు బయటపడతామా? అని జనమంతా ఎధురుచూస్తుంటే... ఈ జంట మాత్రం బైకుపైనే సరసాలు మొదలెట్టింది. జనం చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సదరు జంట చేసిన ఘనకార్యాన్ని గుర్తు తెలియని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News