: ఇచ్చి తీరాల్సిందే!... రాజధాని కోసం నేలపాడులో భూసేకరణకు మరో నోటిఫికేషన్!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో రాజధాని నిర్మాణం పేరిట భూసేకరణకు మరో నోటిఫికేషన్ జారీ అయ్యింది. అమరావతి పరిధిలోని నేలపాడులో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే మెజారిటీ మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వగా 45 మంది రైతులు అందుకు ససేమిరా అన్నారు. ఇప్పటికే సేకరించిన భూముల మధ్యలో చిన్న చిన్న బిట్లుగా ఉన్న 27 ఎకరాల భూమి సేకరణకు ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ల్యాండ్ పూలింగ్ పధ్ధతిలో భూమిని సేకరించనున్న ప్రభుత్వం భూ యజమానులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించనుంది. నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో సదరు భూముల క్రయ విక్రయాలపై నిషేధం విధిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ పై అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని భూయజమానులకు ప్రభుత్వం సూచించింది.

  • Loading...

More Telugu News