: హైదరాబాదులో భారీ వర్షం
హైదరాబాదు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ సాయంకాలం జంటనగరాలలో సుమారు అరగంటపాటు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం ధాటికి నాలాలన్నీ పొంగిపొర్లాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.