: విజయవాడ ఆసుపత్రిలో శిశువు అపహరణ ఘటనలో నిందితులు సిబ్బందే... అరెస్టు


విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శిశువు అపహరణ ఘటనలో బాధితుల ఆరోపణలు నిజమయ్యాయి. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది హస్తముందని వారు మొదటి నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే సిబ్బంది మాత్రం వారి ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. ఈ ఘటనలో పోలీసు దర్యాప్తులో ఆసుపత్రి సిబ్బంది హస్తం బయటపడింది. ఈ కేసు బిడ్డల్ని అపహరించే ముఠా పని కాదని... ప్రధాన నిందితురాలు నాగమల్లేశ్వరి అని తేలింది. ఆమె మూడో వివాహం చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమె రెండో వివాహం చేసుకున్నప్పుడే భవిష్యత్ లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందని తేలింది. అయితే ఈ విషయం మూడో భర్తకు చెప్పలేదు. దీంతో గర్భం దాల్చానని అతనిని నమ్మించిన నిందితురాలు... దానిని నిజం చేసేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి రికార్డు అసిస్టెంట్ శ్రీనును ఆశ్రయించింది. అతను 'మరేం ఫర్వాలేదు, బిడ్డ దొరికేసినట్టే'నని అభయమిచ్చాడు. దీంతో అతని సహకారంతో ఆమె బిడ్డను ఎత్తుకుని వెళ్లిపోయింది. ఈ ఘటనలో వారిద్దరితో పాటు, బిడ్డ గురించిన కథనాలను మీడియాలో చూసి కూడా చెప్పని భర్త రాజు, విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సంఘటన జరిగిన తర్వాత తాము విడుదల చేసిన సీసీ టీవీ పుటేజ్ లో ఉన్న వ్యక్తులు తమ కారణంగా మనసు నొచ్చుకుని వుంటే, తమను క్షమించాలని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ కోరారు.

  • Loading...

More Telugu News