: పక్కన కోడి ఉంటే, మలేరియా దోమలు మన వైపు కూడా చూడవట!
మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే, ఒక కోడిని పక్కన పెట్టుకుంటే చాలట. ఈ విషయం తమ పరిశోధనలో వెల్లడైందని ఇథియోపియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోడి మన పక్కన ఉంటే మలేరియా వ్యాధి ఎందుకు రాదంటే... మనుషుల, జంతువుల రక్తం పీల్చే దోమలు, ముఖ్యంగా మలేరియా వ్యాపింపజేసే దోమలు కోళ్ల జోలికి మాత్రం పోవట. ఎందుకంటే, కోడి నుంచి వచ్చే వాసన వాటికి గిట్టదని, అందుకని, వాటి దగ్గరకి అవి రావని వారి పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన నిమిత్తం ఇథియోపియా, స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్తలు రక్తం పీల్చిన కొన్ని దోమలను పట్టుకుని వాటిలో రక్తాన్ని పరిశీలించగా ఈ విషయం తెలిసింది. సుమారు 1200 దోమల్లో ఒక్క దోమ మాత్రమే కోడిని కుట్టినట్లు కనుగొన్నామని స్వీడిష్ అగ్రి యూనివర్శిటీకి పరిశోధకులు రికార్డ్ ఇగ్నెల్ పేర్కొన్నారు.