: ఏపీ డీజీపీ రాముడుని రిలీవ్ చేసిన ప్రభుత్వం...కొత్త డీజీపీ సాంబశివరావు

ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు పదవీ కాలం ఎల్లుండితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నండూరి సాంబశివరావు ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, డీజీపీ రాముడు పదవీ కాలం రెండు నెలలపాటు పొడిగించనున్నారంటూ వెలువడిన వార్తలన్నీ ఊహాగానాలని రుజువైంది.