: నవాజ్ షరీఫ్, పర్వేజ్ ముషారఫ్ లైనేశారంటున్న పాకిస్థాన్ యువతి
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ లు తనకు లైనేశారని పాకిస్థాన్ యువతి అస్మా వెల్లడించింది. హెచ్ టీవీ నిర్వహిస్తున్న వకార్ జకా రియాల్టీ షోలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని ఆమె తెలిపింది. విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తుండగా నవాజ్ షరీఫ్ తనను చూసి తొలుత నవ్వారని, ఆ తరువాత సాయంత్రం ప్రోగ్రాం ఏంటని అడిగారని తెలిపింది. ఏమీ లేదని తాను జవాబివ్వడంతో డిన్నర్ కి ఆహ్వానించారని తెలిపింది. అయితే తాను వెళ్లలేదని చెప్పింది. మరో సందర్భంలో మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తనకు లైనేశారని చెప్పింది. ముషారఫ్ డ్రెస్సింగ్ సెన్స్ తనకు నచ్చిందని, అతని స్టైల్ కూడా సెపరేటని తెలిపింది. ముషారఫ్ లైనెయ్యడం నచ్చిందని చెప్పిన అస్మా... నవాజ్ షరీఫ్ లైనెయ్యడం నచ్చలేదని పేర్కొంది.