: హైకోర్టు విభజనపై తీర్పును సమీక్షించాలన్న పిటిషన్ పై వాదనలు పూర్తి... తీర్పు రిజర్వ్!


ఉమ్మడి హైకోర్టు విభజనపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. గత తీర్పును సమీక్షించాలన్న పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఏపీ హైకోర్టు హైదరాబాద్ లో ఉండరాదని, సొంత రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ఆ పిటిషనల్ తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై ఈరోజు తుదివాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. హైకోర్టును విభజించినప్పుడు ఏపీ హైకోర్టు హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపీ హైకోర్టు నిమిత్తం ప్రస్తుత భవనాన్ని ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఇక, హైకోర్టు తీర్పు తమ అధికారాలను పరిమితం చేసేలా ఉందని కేంద్రం పేర్కొనగా, అన్ని అంశాలు పరిశీలించాకే గతంలో తీర్పు ఇచ్చారని ఏపీ ప్రభుత్వం తమ వాదన వినిపించింది.

  • Loading...

More Telugu News