: సరదాగా వేసిన ‘బాంబు’ జోక్ విమానాశ్రయంలో ఆ స్నేహితులకి చమటలు పట్టించింది!


ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ఇద్ద‌రు స్నేహితులు స‌ర‌దాగా వేసుకున్న ఓ జోకు టెన్షన్ వాతావరణం నెలకొన‌డానికి కార‌ణ‌మ‌యింది. ఆ ఇద్దరు మిత్రులకి చెమటలు పట్టేలా చేసింది. ఢిల్లీ నుంచి ఇండోర్‌కు బ‌య‌లుదేరిన వారు విమానం ఎక్కేందుకు క్యూలో నిలబడ్డారు. ఈ స‌మ‌యంలో వారిద్ద‌రిలో ఒక‌రు ‘దయచేసి.. నేను బాంబు తీసుకెళ్లవచ్చా’ అని స్నేహితుడితో మెల్లిగా, స‌ర‌దాగా అన్నాడు. కానీ ఈ మాట అక్క‌డే ఉన్న‌ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి వినిపించింది. ఉగ్ర‌వాదుల దాడుల‌తో ప్ర‌పంచం వ‌ణికిపోతోన్న నేప‌థ్యంలో వారి మాట‌లు ఉగ్ర‌వాదుల మాట‌ల్లా ఉన్నాయ‌ని భావించి భ‌య‌ప‌డిపోయి, వారు సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌)కు ఈ విషయాన్ని చెప్పారు. వెంట‌నే ఆ ఇద్దరు మిత్రులని సీఐఎస్ఎఫ్‌ బలగాలు చుట్టుముట్టేశాయి. త‌రువాత‌ ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకొని వారిని క్ష‌ణ్ణంగా త‌నిఖీ చేసి, వారి మాట‌లపై ఆరా తీశాయి. చివ‌రికి అస‌లు విష‌యాన్ని తెలుసుకొని వ‌దిలేశాయి. స‌ర‌దాగా వేసిన జోక్ ఇంత‌టి సీన్ క్రియేట్ చేసింది.

  • Loading...

More Telugu News