: నిరుపేదలకు నేను దేవత లాంటిదాన్ని... అందుకే ఆందోళనలు: మాయావతి
నిరుపేదలకు తాను దేవతలాంటిదాన్నని మాయావతి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్న ఆందోళనలపై ఆమె మాట్లాడుతూ, దేవతలా అభిమానించే తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారంతా ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనలో తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలని ఆమె చెప్పారు. బీజేపీ అధిష్ఠానం తమ యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ పై మొక్కుబడి చర్యలు తీసుకుందని ఆమె ఆరోపించారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దయాశంకర్ ను సస్పెండ్ చేస్తే సరిపోదని, కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి భావజాలమున్న బీజేపీని దేశప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆమె తెలిపారు.