: సౌదీలో ‘పోకేమాన్’పై నిషేధం విధిస్తూ ఫత్వా జారీ


‘పోకేమాన్’ మొబైల్ గేమ్ పై సౌదీ అరేబియా లో నిషేధం విధించారు. ఈ గేమ్ ఇస్లాం మతానికి వ్యతిరేకమని భావించిన మత గురువుల మండలి ఫత్వా జారీ చేసింది. ఈ ఆటలో జపాన్ కు చెందిన షింటో మతం, జియోనిజంతో పాటు క్రైస్తవ మత చిహ్నాలున్నాయని, ఇతర మతాలను ప్రచారం చేయడం ‘ఇస్లాం’కు వ్యతిరేకమని, అందుకే ఈ ఆటలను నిషేధిస్తున్నామని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ‘పోకేమాన్’ గేమ్ పై ఫత్వా జారీ నిమిత్తం 2001 నాటి డిక్రీని సవరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News