: ఒవైసీకి వ్యతిరేకంగా బీజేపీ సంతకాల సేకరణ.. దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్
హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసుల సమక్షంలో ఎన్ఐఏ చేసిన సోదాల్లో పట్టుబడిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తానని ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఒవైసీకి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు యూసఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద కొనసాగించారు. దీనిలో పాల్గొన్న కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తమ వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం అధినేతపై ఈ అంశంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తాము ఫిర్యాదు లేఖను అందించినట్లు ఆయన గుర్తు చేశారు.