: లేట్ నైట్ పార్టీలంటే బాగా ఇష్టం... తన చుట్టూ అమ్మాయిలు ఉండాలని కోరుకుంటాడు: పీటర్ ముఖర్జియా మాజీ భార్య సాక్ష్యం
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన షీనా బోరా హత్య కేసు నిందితుడు పీటర్ ముఖర్జియా రాసలీలలు, జీవన విధానంపై ఆయన మాజీ భార్య సీబీఐకి తెలిపారు. షీనా బోరా హత్య కేసులో సీబీఐ అధికారులు చెబుతున్న నైతిక విలువల పతనం అంశాన్ని ఆమె ప్రధానంగా స్పష్టం చేయడం విశేషం. మీడియా మొఘల్ గా వెలుగొందిన పీటర్ ముఖర్జియాకు అసలు నైతిక విలువలనేవే లేవని ఆమె స్పష్టం చేశారు. అందరూ అనుకుంటున్నట్టు ఆయన అంత గౌరవప్రదమైన వ్యక్తి కాదని ఆమె సీబీఐ అధికారులకు వెల్లడించారు. ఆయన జీవితంలో తాను, ఇంద్రాణీ ముఖర్జియా మాత్రమే కాదని, ఇంకా ఎంతో మంది మహిళలు ఉన్నారని ఆమె తెలిపారు. లేట్ నైట్ పార్టీలంటే ఎంతో ఇష్టపడే పీటర్ ముఖర్జియా, తన చుట్టూ అమ్మాయిలు ఉండాలని కోరుకుంటాడని ఆమె తెలిపారు. ఇవి భరించలేకే ఆయనతో విడిపోయానని ఆమె చెప్పారు. ఆ తరువాత ఓసారి తన ప్రేయసి అంటూ ఇంద్రాణిని పరిచయం చేశాడని, ఆయితే ఆమెను వివాహం చేసుకుంటాడని భావించలేదని ఆమె చెప్పారు. ఆ తరువాత వారు వివాహం చేసుకున్నారని, ఓసారి ఇంద్రాణి తనకు ఫోన్ చేసి, భరణం ఎంత కావాలో చెప్పాలని, అదే ఫైనల్ అని, ఆ తరువాత వేధించడానికి వీలు లేదని ఫోన్ లో హెచ్చరించిందని, 'నోరుమూసుకుని నీ పని నువ్వు చూసుకో' అని తాను సమాధానం చెప్పానని ఆమె సీబీఐ అధికారులకు రహస్య సాక్షిగా వాంగ్మూలమిచ్చారు.